నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద టిడ్కో ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు 227 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల తాళాలను స్వీకరించారు. విద్యుత్ కనెక్షన్లు వంటి అవసరమైన వసతులను ఏర్పాటు చేసుకుని, లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది లబ్ధిదారులకు కూడా త్వరలోనే తాళాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.