సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. వెంకటగిరికి చెందిన జొన్నదుల ధార్విక్ శివాన్ష్ కుటుంబ సభ్యులు రూ.60,000, త్రివేదుల విష్ణు కుటుంబ సభ్యులు రూ.50,000 నగదును విరాళంగా అందజేశారు. ఈ విరాళాలను సహాయ కమిషనర్, ఈఓ బి. ప్రసన్నలక్ష్మీ స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం రూ.1.10 లక్షల విరాళం అందింది.