సూళ్లూరుపేట స్టేట్ బ్యాంక్ వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం బాధ్యతగా భాగస్వామ్యం కావాలని సూచించారు.