సూళ్లూరుపేట: జాతీయస్థాయి స్నూకర్లో మెరిసిన చిట్టమూరు చిన్నారి

306చూసినవారు
సూళ్లూరుపేట: జాతీయస్థాయి స్నూకర్లో మెరిసిన చిట్టమూరు చిన్నారి
హర్యానాలో జరిగిన జాతీయస్థాయి సబ్‌జూనియర్ ఛాంపియన్‌షిప్ స్నూకర్ పోటీల్లో చిట్టమూరుకు చెందిన కట్టుబోయిన ధువాని కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కోచ్‌లు శ్రీహరి హెర్రెన్, ఎస్. సూర్యనారాయణల పర్యవేక్షణలో శిక్షణ పొందిన ధువాని, గత డిసెంబర్‌లో తమిళనాడులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి అర్హత సాధించింది. ఈ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్