సూళ్లూరుపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

697చూసినవారు
సూళ్లూరుపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
బుధవారం ఉదయం సూళ్లూరుపేట హోలీ క్రాస్ జంక్షన్ వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్