సూళ్లూరుపేట: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

381చూసినవారు
సూళ్లూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, చైన్ సహాయంతో హైవే నుంచి సూళ్లూరుపేటలోకి వచ్చే వాహనాలకు ప్రత్యేక మార్గాన్ని కల్పించారు. దీంతో అడ్డదారిలో వాహనాల రాకపోకలకు అడ్డుకట్ట పడింది. రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేయవద్దని హైవే సిబ్బందికి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్