సూళ్లూరుపేట నియోజకవర్గంలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో అశాంతి నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అక్రమ మద్యం విక్రయాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.