తడ మండలం వెండ్లూరుపాడు గ్రామంలో గత మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో నీటి కొరత మరింత తీవ్రంగా మారింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.