సులూరుపేటలోని పులికాట్ సరస్సు ఎండిపోవడంతో వలస పక్షులు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి. ఇటీవల ఒక పెలికాన్ పక్షి మృతి చెందడం కలకలం రేపింది. సరస్సు ముఖ ద్వారంలో పూడిక తీయకపోవడమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరిన్ని పక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.