రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి

435చూసినవారు
రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో ఫిబ్రవరి 1న ఆదివారం జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ తీర్థానికి ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్