తిరుమలలో నిషేధిత ఫొటో షూట్‌.. భద్రతపై విమర్శలు

2003చూసినవారు
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఫోటోషూట్లు, రీల్స్ చేయడంపై టీటీడీ నిషేధం విధించినప్పటికీ, కొందరు భక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా బుధవారం ఒక నూతన జంట ఆలయం ముందు నుదిటిపై ముద్దులు పెట్టుకుంటూ ఫోటోషూట్ నిర్వహించింది. ఈ ఘటనపై భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శలు వస్తున్నాయి. భద్రతా సిబ్బంది స్పందించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్