వేదిక్ విద్యాన్ స్కూల్లో 222 మంది విద్యార్థుల భగవద్గీత పారాయణం

424చూసినవారు
వేదిక్ విద్యాన్ స్కూల్లో 222 మంది విద్యార్థుల భగవద్గీత పారాయణం
తిరుపతిలోని వేదిక్ విద్యాన్ స్కూల్లో 222 మంది విద్యార్థులు 2 గంటల 22 నిమిషాల పాటు నిరంతరంగా భగవద్గీత పారాయణం చేసి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ డా. సి. శ్రీరాములు, సంస్కృత ప్రొఫెసర్ శ్రీ సింగంసెట్టి సుబ్బరాయుడు, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య, ట్రేడిషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ సమన్వయ కర్త సురేఖ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వేదిక్ విద్యాన్ స్కూల్ కు ట్రేడిషనల్ బుక్ అఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది.

సంబంధిత పోస్ట్