తిరుపతికి చెందిన హిందీ సలహా కమిటీ సభ్యుడు డా. పి.సి. రాయులు, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శిఖావత్‌ను గురువారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హిందీ సలహా కమిటీలో మూడేళ్ల పదవికి నామినేషన్ ఇచ్చినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. మంత్రిత్వ శాఖలో హిందీ అమలు, విస్తృత వినియోగం కోసం కృషి చేస్తానని డా. రాయులు తెలిపారు.