తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

458చూసినవారు
బుధవారం తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. కన్నడ సినీనటి తార, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, అల్లు స్నేహారెడ్డి వంటి వారు నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్