తిరుపతిలో భారీ వర్షం... ఉక్కపోతకు చెక్

1009చూసినవారు
తిరుపతి నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే, కుండపోత వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అధికారులు నీటి నిల్వలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్