తిరుమల కొండ పై భారీ రద్దీ

929చూసినవారు
తిరుమల కొండ పై భారీ రద్దీ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలిరావడంతో కొండపై భారీ రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, తాత్కాలిక వేచిచోట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. పెరిగిన రద్దీ నేపథ్యంలో టీటీడీ ఇవాళ విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే శ్రీవాణి దర్శన టికెట్ల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున భక్తులు సహనం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్