తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 67,526 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, 25,780 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.