తిరుపతికి చెందిన అబ్దుల్లా, అమ్మిన్నా అనే ముస్లిం దంపతులు గురువారం స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో పద్మావతిపురంలోని ఆయన నివాసంలో ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య ఈ మత స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దంపతులతో గోవింద నామస్మరణ చేయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.