తిరుపతికి చెందిన అబ్దుల్లా, అమ్మిన్నా అనే ముస్లిం దంపతులు హిందూ మతాన్ని స్వీకరించారు. గురువారం ఉదయం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉన్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి నివాసంలో వీరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిచేత గోవింద నామాలు పలికించి, హిందూ మతంలోకి మార్చారు. భూమన కరుణాకర రెడ్డి ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు.