తిరుమలలో ఫొటో షూట్ వివాదం.. దంపతుల వివరణ

162చూసినవారు
తిరుమల శ్రీవారి ఆలయం ప్రాంగణంలో నూతన దంపతులు ఫొటోషూట్ చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో, తిరువన్నమలై–గాయత్రి దంపతులు గురువారం సాయంత్రం వివరణ ఇచ్చారు. తాము తెలియక ఆలయ పరిసరాల్లో ఫొటోలు తీసుకున్నామని, నిబంధనలకు విరుద్ధమని తెలిసిన వెంటనే వాటిని తొలగించినట్లు తెలిపారు. జరిగిన తప్పుకు క్షమాపణలు చెబుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం చేయబోమని స్పష్టం చేశారు. అలాగే శ్రీవారి సేవా పథకంలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్