శుక్రవారం తిరుమల శ్రీవారిని బెంగాల్ గవర్నర్ ఆర్. ఎన్. రవి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేసి, వేదాశీర్వచనం, శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు.