ఆహార పరిశ్రమలో జీరో వేస్ట్ పై ప్రత్యేక ఉపన్యాసం

1068చూసినవారు
ఆహార పరిశ్రమలో జీరో వేస్ట్ పై ప్రత్యేక ఉపన్యాసం
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హోమ్ సైన్స్ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–22, న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) తిరుపతి చాప్టర్ సంయుక్తంగా మార్చి 28న “ఆహార పరిశ్రమలో జీరో వేస్ట్” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాదులోని కెన్యా బయోసైన్సెస్ లిమిటెడ్ సంస్థ ఆర్ & డి విభాగాధిపతి డా. ఎస్. చెన్న కేసవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆహార పరిశ్రమలో వ్యర్థాల నిర్వహణపై ప్రసంగించారు. ప్రొఫెసర్ ఎన్. రజని, ఎన్‌ఎస్‌ఐ తిరుపతి చాప్టర్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. అరుణ, డా. వి. బిందు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్