తిరుమలలో వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

537చూసినవారు
తిరుమలలో వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
తిరుమల శేషాచల అడవుల్లోని రామకృష్ణతీర్థంలో ఆదివారం ముక్కోటి వేడుక ఘనంగా జరిగింది. ప్రతి ఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థం సృష్టించబడిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు మంత్రోచ్ఛారణతో ఊరేగింపుగా రామకృష్ణతీర్థానికి చేరుకుని, శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణభగవానుల విగ్రహాలకు విశేషంగా అభిషేకం చేసి, పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్