తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

423చూసినవారు
శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న తదితరులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్