తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పెద్దకాపు లేఅవుట్ లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 ఏళ్ల బాలుడు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అయితే, ర్యాపిడ్ డ్రగ్ టెస్టులో బాలుడికి పాజిటివ్ రావడంతో, నిబంధనల ప్రకారం జువెనైల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.