తిరుపతి: 250 కోట్ల ఏళ్లనాటి సహజ శిలాతోరణం భక్తుల ఆకర్షణ

1245చూసినవారు
తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న సహజ శిలాతోరణం భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ శిలాతోరణం దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తోరణం ఒకవైపు శంఖు, మరోవైపు చక్రం ఆకృతులను పోలి ఉండటంతో దీనిని మహావిష్ణువు మహిమగా భక్తులు భావిస్తారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన సహజ శిలాతోరణాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది.

సంబంధిత పోస్ట్