తిరుపతి: కల్తీ నెయ్యి అంశాన్ని మళ్లించేందుకే అంబటి వ్యాఖ్యలు

768చూసినవారు
కల్తీ నెయ్యి అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంబటి రాంబాబు సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబటి నోటిదూకుడుతో మాట్లాడితే ప్రభుత్వం కాపులపై కక్ష సాధిస్తోందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు కాపు సంఘాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి రాజకీయ డ్రామాలను గుర్తించి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్