దేశ ఆర్థికాభివృద్ధిలో పశుసంవర్ధక రంగం కీలకమని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు అందజేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను సమాజ సేవకు వినియోగించి, పశుసంవర్ధక రంగ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.