తిరుపతి: విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు వస్తాయి

324చూసినవారు
తిరుపతి: విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు వస్తాయి
నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ, స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్వీయు ఆడిటోరియం వద్ద "జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్" అనే అంశంపై విద్యార్థులకు చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్