తిరుపతి: జేపీ జ్యువెలరీలో చైన్ చోరీ.. నిందితుడు అరెస్ట్

299చూసినవారు
తిరుపతి: జేపీ జ్యువెలరీలో చైన్ చోరీ.. నిందితుడు అరెస్ట్
తిరుపతిలోని జేపీ జ్యువెలరీలో మార్చి 23న జరిగిన బంగారు చైన్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా నాగయ్యపల్లితండాకు చెందిన బానోతు భాస్కర్(21)గా గుర్తించారు. అతడిని తిరుపతిలోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4లక్షల విలువైన బంగారు చైన్‌తో పాటు రూ. 80వేల విలువైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్