తిరుపతి: శిక్షణలో ఉన్న పిల్లలపురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

1033చూసినవారు
తిరుపతి: శిక్షణలో ఉన్న పిల్లలపురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థలో శిక్షణ పొందుతున్న వినికిడి లోపం గల చిన్నారుల పురోగతి దశలపై ఛార్ట్‌లు రూపొందించాలని టీటీడీ జేఈవో (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్) డా. ఎ. శరత్ అధికారులకు సూచించారు. బుధవారం శ్రవణం ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, పిల్లల సంరక్షకులకు వారి పురోగతిని వీడియో రూపంలో అందిస్తే వారిలో ఆనందం పెరుగుతుందని తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుండి శిక్షణ పూర్తయ్యే వరకు పిల్లల పురోగతిని నమోదు చేసి, సంరక్షకులకు తెలియజేయాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్