విశాఖపట్నంలో జరిగిన 9వ అంతర్జాతీయ కరాటే పోటీల్లో తిరుపతి జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బందిలి రంగారావు కుమారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్–13 కాటా, కుమితే విభాగాల్లో ఆర్. జోగేష్ రెండు స్వర్ణ పతకాలు సాధించగా, అండర్–7 కాటాలో ఆర్. శశి ప్రీతమ్ స్వర్ణం, కుమితేలో రజత పతకం గెలుచుకున్నారు. వీరి విజయం పోలీస్ శాఖకు గర్వకారణమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు.