తిరుపతి: వైభ‌వంగా ముగిసిన గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

553చూసినవారు
తిరుపతి: వైభ‌వంగా ముగిసిన గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు సాయంత్రం తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్