తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శనివారం శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ముత్యాల తలంబ్రాల ఊరేగింపు వైభవంగా జరిగింది. టిటిడి అధికారులు ఖజానా విభాగంలో ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వాటిని ఊరేగింపుగా ప్రధాన అర్చకులకు అందించారు. అంబారీపై తీసుకెళ్లిన ఈ ఊరేగింపు తీర్థకట్టవీధి, గాంధీరోడ్డు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది.