తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించి, పాలు, పెరుగు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం తెప్పపై విహరించి, ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.