శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకి చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. శనివారం ఈ పరికరాలను టిటిడి జేఈవో (ఆరోగ్యం, విద్య) డా. ఎ. శరత్ కు అందజేశారు. ఈ సందర్భంగా జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ చిన్నపిల్లల హృదయ చికిత్సలకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ విరాళం చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనుంది.