తిరుపతి: క్రీడ‌ల‌కు ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌పీట

1099చూసినవారు
తిరుపతి: క్రీడ‌ల‌కు ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌పీట
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండటానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన కోరారు. రాష్ట్రస్థాయి 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను పాలిటెక్నిక్ కాలేజీలో బుధవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్