తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ శుక్రవారం సాయంత్రం సామాన్య భక్తులతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక హోదాలకు దూరంగా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలైన్‌లో వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సన్నిహితులు కూడా దర్శనంలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని భాష్యం రామకృష్ణ తెలిపారు.