తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష

421చూసినవారు
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో శుక్రవారం తిరుపతి కోర్టు ఒక స్మగ్లర్ కు కఠిన శిక్ష విధించింది. శేషాచలం అటవీ ప్రాంతంలో నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో, తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఎం. రామకృష్ణకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ తీర్పు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుందని ఆర్ఎస్ఎస్టీఎఫ్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్