సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని టిటిడి ఇంఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకులు అందించిన శాస్త్రం, సంప్రదాయాలు, సనాతన వారసత్వ సంపదకు సాంకేతికతను జోడించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన అర్చక, పరిచారిక, వేదపారాయణందారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.