తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం సాయంత్రం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.