తిరుపతి నగరంలో ఎస్‌వీ మెడికల్ కళాశాల సమీపంలో, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 ఏళ్ల వయస్సున్న, తెల్లటి షర్టు ధరించిన మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చరీకి తరలించారు. సమాచారం తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.