తిరుపతి: వేడుకగా వసంతోత్సవాలు ప్రారంభం

676చూసినవారు
తిరుపతి: వేడుకగా వసంతోత్సవాలు ప్రారంభం
తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీమలయప్పస్వామి వారికి జరిగే ఈ ఉత్సవాన్ని 'వసంతోత్సవం' లేదా 'ఉపశమనోత్సవం' అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో స్వామివారికి సుగంధ పుష్పాలు, మధుర ఫలాలను నివేదిస్తారు. వట్టి వేరుతో అలంకరించిన మండపాన్ని, శేషాచల అడవిని తలపించేలా జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో తీర్చిదిద్దారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్