తిరుపతి ఎంఆర్‌పల్లిలో కొందరు యువకులు అర్ధరాత్రి హల్‌చల్ సృష్టించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పార్కింగ్ చేసిన టూవీలర్లను తోసేస్తూ అల్లరి చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని పీజీ విద్యార్థులే ఈ ఘటనకు పాల్పడ్డారని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.