రాపూరులోని జెమ్స్ పాఠశాలలో అబిద్ సార్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ 2025–26 ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం క్రీ.శే. అబిద్ సార్ గారి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలను పాఠశాల కరెస్పాండెంట్ మునీంద్రా రెడ్డి, ఫౌండర్ & చైర్మన్ జనార్ధన్ రెడ్డి, డైరెక్టర్ స్వాతి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.