డక్కిలిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

426చూసినవారు
డక్కిలిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలంలో నాగోలు, చాపలపల్లి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, శ్రీకాళహస్తి ఆర్డీఓ బాను ప్రకాష్ రెడ్డి కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సచివాలయాల్లో సిబ్బంది హాజరు, పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్ పరిశీలించి, ప్రజలతో మర్యాదపూర్వకంగా, సహకారభావంతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్