వాకాడు టీడీపీ నాయకులు ఆదివారం వైసీపీ నాయకులు ప్రతి కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మాజీ సీఎం జగన్ పలికించారని రాష్ట్ర ప్రజలంతా గుర్తిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ శాంతి భద్రతలను పరిరక్షిస్తుందని, అశాంతి, అభద్రత వైసీపీ నైజమని ఆరోపించారు.