Oct 24, 2025, 17:10 IST/
'బండి సరోజ్ తో మంచి స్నేహబంధం ఉంది'
Oct 24, 2025, 17:10 IST
ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, రోషన్ కనకాలతో 'మోగ్లీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న పబ్లిక్ స్టార్ బండి సరోజ్‌తో దర్శకుడికి విభేదాలు వచ్చాయని వచ్చిన వార్తలపై సందీప్ రాజ్ స్పందించారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, బండి సరోజ్ తనకు సీనియర్ అని, ఆయనతో మంచి స్నేహబంధం ఉందని, క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఉందని ఆయన తెలిపారు. దయచేసి లేనిపోని పుకార్లను సృష్టించవద్దని ఆయన కోరారు. బండి సరోజ్ గతంలో పలు చిత్రాల్లో నటించి, దర్శకత్వం వహించారు.