Jan 24, 2026, 15:01 IST/
మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలను నియమించిన బీఆర్ఎస్
Jan 24, 2026, 15:01 IST
తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇన్ఛార్జీగా బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ సమన్వయకర్తలు కీలక పాత్ర పోషించనున్నారు.