Apr 12, 2026, 09:04 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: అపరిచితుల పట్ల ఆప్రమతంగా ఉండాలి
Apr 12, 2026, 09:04 IST
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ, జనాభా లెక్కలు, ప్రభుత్వ సర్వేల పేరుతో ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్న గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఇలాంటి ఘటన జరిగిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.